01-08-2025 12:17:07 AM
అలంపూర్, జూలై 31 : తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కారమై వారు సుఖసంతోషాలతో జీవించేందుకు రాష్ట్ర ప్రభు త్వానికి మరింత శక్తి, సామర్థ్యం కలగాలని శ్రీ జోగుళాంబ అమ్మవారిని ప్రార్థించినట్లు రాష్ట్ర పశు సంవర్ధక,క్రీడలు,యువజన సర్వీసులు శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
గురువారం సాయత్రం కుటుంబ సమేతం గా అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించిన మంత్రి గారికి దేవాలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ముందుగా శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయం సం దర్శించి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు.
ఈ సందర్బంగా విఘ్నేశ్వర అభిషేకం కూడా నిర్వహించారు. అనంతరం శ్రీ జోగులాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వ హించారు.ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు అమ్మవారి ప్రసాదం శేష వస్త్రం బహు కరించి ఆశీస్సులు అందజేశారు.
అనంతరం మంత్రి శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి నిత్య అన్నదాన సత్రమును ప్రసాద్ స్కీం భవనంలో పూజలో పాల్గొన్నారు. అంతకు ముందు హరిత హోటల్లో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమం లో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్,మాజీ జెడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య,ఆర్డివో అలివేలు,అలంపూర్ తాసిల్దా ర్ మంజుల,ఈ.ఓ పురేందర్,స్థానిక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.