01-08-2025 12:18:32 AM
నల్లగొండ క్రైమ్, జూలై 31: మైనర్‌కు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు 21 ఏండ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించినట్టు నల్లగొండ ఎస్పీ శరత్ చంద్రపవార్ తెలిపారు. నార్కట్‌పల్లి మండలానికి చెందిన వలిగొండ వెంకన్న కట్టంగూరు మండలానికి చెందిన ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. బాధితులు 2018, ఏప్రిల్ 20న కట్టంగూరు పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదయ్యింది.
ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేయగా, వాదోపవాదనల అనంతరం గురువారం నిందితుడికి న్యాయస్థానం 21 ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధించింది. పోక్సో చట్టం ప్రకారం బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో సరైన ఆధారాలు సేకరించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన అప్పటి ఇన్వెస్టిగేషన్ అధికారి, ఎస్‌ఐ బీ రంజిత్, సీఐ క్యాస్ట్రో, ప్రస్తుత సీఐ కొండల్ రెడ్డి, ఎస్‌ఐ రవీందర్, పీపీ వేముల రంజిత్, సీడీవో రువ్వా నాగరాజు తదితరులను ఎస్పీ శరత్ చంద్రపవార్ అభినందించారు.