21-05-2025 10:10:54 AM
విజయపుర: కర్ణాటక రాష్ట్రం(Karnataka) విజయపురలోని బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. మనగులు సమీపంలో ఒక ప్రైవేట్ బస్సు, కారు ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు, బస్సులో ఉన్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించారని అధికారులు వెల్లడించారు. గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న మనగులి పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.