21-05-2025 12:19:21 PM
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో(Naxalites Encounter) 28 మంది నక్సల్స్ మరణించినట్లు అదికారులు తెలిపారు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య నారాయణపూర్ జిల్లా మాధ్ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. అయితే ఈ భారీ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు(Maoist top leader Nambala Keshava Rao) మరణించినట్లు ప్రచారం సాగుతోంది. బసవరాజు ఉన్నారన్న సమాచారంతో మాధ్ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టాయి. నంబాల కేశవావుపై రూ. కోటిన్నర రివార్డు ఉందని పోలీసులు ప్రకటించారు.
నంబాల కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా(Srikakulam District) జియ్యన్నపేట. తూర్పు గోదావరి విశాఖలో మావోయిస్టు పార్టీలో నంబాల కేశవరావు పనిచేశారు. గణపతి రాజీనామాతో నంబాల పార్టీకి సుప్రీం కమాండర్ బాధ్యతలు నిర్వహించారు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో నంబాల కేశవరావు ఒకరు. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో నంబాల కేశవరావు దిట్ట. ఐఈడీల వినియోగంలో నంబాల కేశవరావు నిఫుణుడు. 1970 నుంచి మావోయిస్టు వ్యవహారాల్లో నంబాల చురుగ్గా ఉన్నారు. వరంగల్ ఆర్ఈసీలో నంబాల కేశవరావు ఇంజినీరింగ్ చదివాడు. నంబాల కేశవరావు అలియా్ బసవరావు తండ్రి ఉపాధ్యాయుడు. 1984లో ఎంటెక్ చదువుతూ పీపుల్స్ వార్ సిద్ధాంతాలు పట్ట నంబాల ఆకర్షితుడయ్యాడు. 2018లో గణపతి రాజీనామతో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నంబాల ఎదిగాడు. 2010 లో ఛత్తీస్ గఢ్ లో 76 మంది సీఆర్ ఫీఎఫ్ జవాన్ల మృతి ఘటనకు నంబాల సూత్రధారి.