calender_icon.png 21 May, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు: నిందితుల పోలీసు కస్టడీపై నేడు తీర్పు

21-05-2025 10:27:45 AM

అమరావతి: విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు(Vizianagaram blasts conspiracy case) నిందితుల పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడు తీర్పు వెలువడనుంది. నిందితులు సిరాజ్, సమీర్ పోలీసు కస్టడీ పిటిషన్ పై కోర్టు తీర్పు ఇవ్వనుంది. విజయనగరం జిల్లా కోర్టు లో నిన్న రాత్రి వరకు వాదనలు సాగాయి. వాదనలు పూర్తయిన అనంతరం విజయనగరం జిల్లా కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. నిందితుల కస్టడీ లభిస్తే ఎన్ఐఏ(National Investigation Agency) మరింత లోతైన విచారణ చేయనుంది. ఇప్పటికే నిందితులకు సంబంధించి పలు కీలక అంశాలను నిఘా వర్గాలు సేకరించాయి. ఉగ్ర కుట్ర, వాటి మూలాలను జాతీయ దర్యాప్తు సంస్థ పసిగట్టింది.

సిరాజ్, ఆయన కుటుంబసభ్యుల ఖ్యాంకు ఖాతాలపైనా ఎన్ఐఏ ఆరా తీసింది. సిరాజ్ కు సంబంధించిన బ్యాంకు లాకర్ లో రూ. 42 లక్షలను గుర్తించారు. విజయనగరం లోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(Vizianagaram District Central Cooperative Bank) లాకర్ లో రూ. 42 లక్షలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సిరాజ్ కుటుంబసభ్యుల లాకర్, ఖాతాల్లోనూ భారీ నగదు నిల్వలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సిరాజ్ అరెస్టైన మరుసటి రోజు లాకర్ తెరిచేందుకు కుటుంబసభ్యులు విఫలయత్నం చెందారు. బ్యాంకు అధికారులను సంప్రదించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిరాజ్ తో పాటు కుటుంబసభ్యులకూ డీససీబలోనే ఖాతాలపై ఎన్ఐఏ దృష్టి పెట్టింది.