21-05-2025 11:50:52 AM
నారాయణ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లా(Narayanpur District)లో జరిగిన భారీ ఎన్ కౌంటర్(Encounter)లో 28 మది నక్సల్స్ మరణించినట్లు అదికారులు తెలిపారు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య నారాయణపూర్ జిల్లా మాధ్ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. అటవీప్రాంతమైన అబుజ్మద్ ప్రాంతంలో బుధవారం ఉదయం ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో నారాయణ్‌పూర్, బీజాపూర్, దంతేవాడ జిల్లాల నుండి డీఆర్ జీ(District Reserve Guard) సిబ్బంది పాల్గొన్నారు. ఎన్ కౌంటర్ లో 28 మంది మరణించారని పోలీసులు ధృవీకరించారు. ఎన్ కౌంటర్ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు.
కొనసాగుతున్న ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు అగ్రశ్రేణి నక్సల్ నాయకులను చుట్టుముట్టాయని సమాచారం. మావోయిస్టుల మాడ్ డివిజన్‌కు చెందిన సీనియర్ క్యాడర్లు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారం ఆధారంగా నాలుగు జిల్లాల నుండి జిల్లా రిజర్వ్ గార్డ్ బృందాలు ఈ ప్రాంతంలో ఆపరేషన్ ప్రారంభించినప్పుడు నక్సలైట్లు కాల్పులు జరిపారని అధికారి తెలిపారు. తెలంగాణ సరిహద్దు వెంబడి ఉన్న కర్రెగుట్ట కొండల సమీపంలోని ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా అడవులలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సలైట్లు మరణించిన రెండు వారాల తర్వాత ఇది జరిగింది. కాగా బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతిచెందినట్టు భద్రతా బలగాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.