21-05-2025 10:40:41 AM
హైదరాబాద్: మెదక్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తూప్రాన్ మండలం(Toopran Mandal) యావాపూర్ గ్రామంలో మారుతి స్విఫ్ట్ కారు, మహీంద్రా బొలెరో ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం తూప్రాన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న తూప్రాన్ పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపడిన ఎనిమిది మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సిఉంది.