రైల్వే ఇంజిన్లలో ఏసీలు ఏర్పాటుచేయాలి..
13-05-2025 12:00 AM
భారత రైల్వే పరిధిలో ఎలక్ట్రిక్ ఇంజిన్లు 10,500, డీజిల్ ఇంజిన్లు 4,500 ఉన్నాయి. వీటిలో 700 కంటే తక్కువ ఇంజిన్లలో మాత్రమే ఏసీలు ఉన్నాయి. వాటిలో కూడా 50శాతం ఏసీలు పనిచేస్తున్నాయి. సాధారణ సమయాల్లో కాకుడా వేసవిలో ఇంజిన్లలో 50 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. వేసవిలో లోకోపైలట్లు విధులు నిర్వహించడంఅత్యంత కష్టతరం.
ఇంజిన్లలో సరైన ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని దశాబ్దాల నుంచి లోకోపైలట్లు డిమాండ్ చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా రైల్వేశాఖ ఉన్నతాధికారులు స్పందించి రైల్వే ఇంజిన్లను ఎయిర్ కండీషనింగ్ చేయాలి.
- ఆళవందార్ వేణుమాధవ్, హైదరాబాద్






