28-10-2025 04:34:23 PM
పదివేల రూపాయలు జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష
కొండపాక (విజయక్రాంతి): వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యలు తప్పవని కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. మైనర్లు వాహనాలు నడపవద్దని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడపవద్దని, లైసెన్సర్ మార్చి వాహనాలు నడప రాదని, తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు పాటించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.
మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులపై పదివేల రూపాయల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష అమల్లోకి వచ్చిందని, ఆరు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుతుందన్నారు. మద్యం సేవించి రెండవసారి వాహనం నడుపుతూ పట్టుబడితే 15 వేల రూపాయల జరిమానా, జరిమానా కట్టని ఎడల జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు. శిక్షలో ఎలాంటి మినహాయింపు ఉండదని తెలిపారు.