28-10-2025 04:36:20 PM
కలెక్టర్ హనుమంతరావు..
వలిగొండ (విజయక్రాంతి): మరో రెండు మూడు రోజులపాటు వర్ష ప్రభావం ఉంటుందని రైతులు అప్రమత్తంగా ఉండాలని ధాన్యం కాపాడుకునేందుకు చర్యలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. వలిగొండ మండలంలోని నాగారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అకాల వర్షంతో రైతుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అయినప్పటికీ రైతులు తమ ధాన్యాన్ని మధ్య దళారులకు అమ్ముకోవద్దని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మి మద్దతు ధర పొందాలని అన్నారు. తడిసిన నల్లబారిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసేలా చూస్తామని ఆయన అన్నారు.