calender_icon.png 28 October, 2025 | 7:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

28-10-2025 04:32:28 PM

కలెక్టర్ కుమార్ దీపక్..

హాజీపూర్ (విజయక్రాంతి): భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. మంగళవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను రోడ్లు భవనాల శాఖ డీఈ సజ్జత్ భాషాతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలోని ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలను ఏర్పాటు కోసం రూ, 216 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే వైద్యులు, సిబ్బంది సంఖ్య పెరుగుతుందని, అన్ని వసతులతో స్థానికంగానే వైద్యం అందుతుందన్నారు.