05-02-2026 01:34:55 AM
బాధితురాలు గట్టు స్నేహ
ముషీరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): అక్రమంగా తమపై దాడికి పాల్ప డిన మందమర్రిలోని వెంకటేశ్వర ఆలయం అర్చకుడు వనమామలై సత్యదేవ్ పై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితురాలు గట్టు స్నేహ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు బుధవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన సోదరితో కలిసి గట్టు స్నేహ మాట్లాడుతూ 2018 సంవత్సరంలో మందమర్రి లోని వెంకటేశ్వర ఆలయానికి దర్శన నిమిత్తం వెళ్లినందున తనపై ఉద్దేశపూర్వకంగానే అర్చకుడు వనమా మలై సత్యదేవ్ తన శఠగోపంతో తలపై కొట్టడంతో తీవ్ర గాయాలైయ్యాయని, అప్పటి నుండి చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు.
తలపై బలమైన గాయం తగలడంతో నరాలు దెబ్బ తిన్నాయని, ఇప్పటికీ తాను ఏ పని చేసుకోలేక నిద్ర కూడా పోవడం లేదని ఆమె వాపోయారు. అక్రమంగా తమ పై ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడిన సత్యదేవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికిని పట్టించుకోకపోవడం అత్యం త బాధా కరమన్నారు.
తమ గోడును పోలీసులు పట్టించుకోకపోవడంతో 2021లో స్థానిక జిల్లా కోర్టులో కేసు వేశామని తెలిపారు. ఏడేండ్లుగా ఆరోగ్యపరంగా నానా ఇబ్బందులు పడుతున్నానని ఆమె తెలిపారు. సత్యదేవ్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.