23-09-2025 06:50:58 PM
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): నల్గొండ పట్టణ కేంద్రంలో పలు ప్రాంతాలలో నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రాత్రికి రాత్రికే తీసివేసిన వ్యక్తులను గుర్తించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. మున్సిపాలిటీ అధికారులు అధికార కాంగ్రెస్ పార్టీ ప్లెక్సీలు ఏర్పాటు చేస్తే 10, 20 రోజులైనా తొలగించకుండా అలాగే ఉంచి మా భారతీయ జనతా పార్టీ నాయకులు ఫ్లెక్సీలు పెడితే మాత్రం వెంటనే తొలగించి మాపై వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. దేశ ప్రధాని అని గౌరవం లేకుండా తొలగించిన వారిపై చట్టరీత్యా చర్య తీసుకొని వారిని శిక్షించాలి లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.