05-09-2025 11:07:33 PM
మూసాపేట: మూసాపేట మండలం వేముల గ్రామంలో బీరప్ప గుడి దగ్గర నిర్వహించినటువంటి గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బీరప్ప యువజన సంఘం యువకులు కిందిమాలే గణేష్ పల్లం శివ ఎలుక మహేష్ రమేష్ తాటికొండ ఆంజనేయులు సంఘము నాయకులు గత తొమ్మిది రోజుల నుంచి నిత్య అన్న దానంతోపాటు పూజలు కార్యక్రమాలు నిర్వహించి శుక్రవారం సాయంత్రం లడ్డువేలం కార్యక్రమం నిర్వహించారు. హోరాహోరిగా గణనాథుని లడ్డు సవాలు పాడగా చివరికి వేముల గ్రామానికి చెందిన తాటికొండ బచ్చన్న రూ 1 లక్ష 25 వేలకు పాడి లడ్డును వేలంలో కైవసం చేసుకున్నాడు. పండ్లు బైండ్ల నర్సింలు రూ 40 వేలకు సవాలు పాడి తీసుకున్నాడు ఈ గణనాథుని లడ్డు సవాల్ కార్యక్రమంలో గ్రామ యువకులు మహిళా మణులు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసుకున్నారు గ్రామస్తులు 1,25,000 పడటం ఇదే తొలిసారి అని అందరూ సంతోషం వ్యక్తం చేశారు.