05-09-2025 10:52:24 PM
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): పాలమూరు యూనివర్సిటీ లో జరిగిన 11 వ జూనియర్ అథ్లెటిక్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని రాణించి మెడల్స్ సాధించిన మహబూబ్ నగర్ క్రీడాకారులను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఘనంగా సన్మానించారు. విశ్రాంత గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల పతకాలు సాధించిన క్రీడాకారులకు నగదు ప్రకటించారు.
అందుకు సంబంధించిన నగదును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో క్రీడాకారులకు నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి క్రీడలపైన ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉందన్నారు. వచ్చే ఒలింపిక్ క్రీడలలో కూడా మన దేశం తరుపున ప్రాతినిధ్యం వహించి, పథకాలు సాధించాలని ఆకాంక్షించారు.