calender_icon.png 6 September, 2025 | 12:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహ్మద్‌ ప్రవక్త బోధనలు సర్వమానవాళికి అనుసరణీయం: డా. కోట నీలిమ

05-09-2025 10:41:20 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): మహ్మద్‌ ప్రవక్త బోధనలు సర్వమానవాళికి అనుసరణీయమని పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు. శుక్రవారం అమీర్ పేట్ డివిజ‌న్‌ బీకేగూడలో స్థానిక ముస్లిం నాయకుల ఆధ్వర్యంలో మహ్మద్‌ ప్రవక్త పుట్టిన రోజైన మిలాద్‌ ఉన్‌ నబి పర్వదిన వేడుకలను అన్నదానంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోట నీలిమ ముఖ్య అతిధిగా హాజరై ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...  మహ్మద్‌ ప్రవక్త దాతృత్వం, కరుణ ధార్మిక చింతన, సర్వ మానవాళి ఐకమత్యాన్ని అకాంక్షించారని పేర్కొన్నారు. మానవాళిని ధర్మమార్గంలో, సత్యమార్గంలో నడుచుకునేలా ప్రవక్త ప్ర‌భోధించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హిందు, ముస్లింలు సోదరభావంతో కలిసిమెలిసి ఉంటున్నారని అన్నారు. మహమ్మద్ ప్రవక్త మానవాళికి గొప్ప సందేశం సందేశం ఇచ్చారన్నారు. సమాజంలో పరమత సహనం ఉండాలి. పదిమంది కోసం బతకాలి. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని అన్నారు. మహమ్మద్ ప్రవక్త సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.