05-09-2025 11:03:33 PM
మహబూబ్‌నగర్,(విజయక్రాంతి): పట్టణంలో గణపతి నిమజ్జనోత్సవం శాంతియుతంగా, ఘనంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం సమగ్ర ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.జానకి జిల్లా పోలీస్ కమాతు మైదానంలో పోలీస్ అధికారులతో సిబ్బందితో బ్రీఫింగ్ సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు. పట్టణవ్యాప్తంగా 280 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయబడిందన్నారు. సీసీటీవీ కెమెరాలు ద్వారా నిమజ్జన ప్రదేశాల పరిస్థితులను పర్యవేక్షించడం జరుగుతుందని పేర్కొన్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో పికెట్స్, రూఫ్ టాప్ బందోబస్తు, పెట్రోలింగ్, స్ట్రైకింగ్ ఫోర్స్లను అమలు చేశారు. మఫ్టీ పోలీస్ బృందాలు 20 మంది స్పెషల్ బ్రాంచ్ సిబ్బందిను నియమించి అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టారు. డీజేలకు, లేజర్ లైట్లకు, పేపర్ సెల్ యంత్రాలకు అనుమతి లేదని ప్రజలకు స్పష్టంగా తెలిపారు. ప్రజలతో సహనంగా, ప్రశాంతంగా వ్యవహరించాలనే సూచనలు పోలీసు సిబ్బందికి ఇచ్చారు.
ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రజలు సౌకర్యంగా ప్రయాణించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ మళ్లింపులు (డైవర్షన్లు) సక్రమంగా అమలు చేస్తారు. నిమజ్జన ప్రదేశాలకు వచ్చే వాహనాలను క్రమబద్ధంగా నిలిపివేయడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించారు. చివరి గణపతి నిమజ్జనం పూర్తయ్యేంత వరకు జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయి అప్రమత్తతతో విధులు నిర్వర్తిస్తుందని ఎస్పీ గతెలిపారు.