calender_icon.png 6 September, 2025 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొమరయ్య ఆశయ సాధన కోసం ముందుకు సాగాలి: సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పుల్లారెడ్డి

05-09-2025 10:37:02 PM

మణుగూరు,(విజయక్రాంతి): సింగరేణి కార్మికులు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసి అనేక హక్కులు సాధించిన కార్మికనేత కామ్రేడ్ కొమరయ్య  ఆశయ సాధన కోసం ముందుకు సాగాలని,  సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సరెడ్డిపుల్లా రెడ్డి కోరారు. శుక్రవారం సిపిఐ కార్యాలయంలో కొమరయ్య 29వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. పుల్లారెడ్డి  మాట్లాడుతూ కార్మికుల పక్షాన నిలబడి వారి సంక్షేమకోసం ఎంతో కృషి  చేశారని అలాంటి నాయకులు అరుదు గా ఉంటారని,వారి పోరాట స్పూర్తితో ప్రతి కార్యకర్త ముందుగా సాగాలని పిలుపునిచ్చారు. నాయకులు లక్ష్మీ కుమారి, సుధాకర్, రమేష్, భిక్షం, వెంకటేశ్వర్లు, నాగరాజు పాల్గొన్నారు.