05-09-2025 08:53:18 PM
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన తల్లి-కొడుకు ద్విచక్రవాహనంపై కరీంనగర్ వైపు వెళ్తుండగా, వెంకట్రావుపల్లి గ్రామ శివారులో వారి వాహనం అదుపుతప్పి పడిపోవడంతో తలకు గాయాలు అయ్యాయి.ఈ సమయంలో డ్యూటీలో భాగంగా అటు వైపు వెళ్తున్న రిజర్వ్ ఇన్స్పెక్టర్ రమేష్ వారిని గమనించి,తన వాహనాన్ని ఆపి హుటాహుటిన తన వాహనంలో కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యంలో అంబులెన్స్ చేరుకోవడంతో వారిని అందులో ఎక్కించి కరీంనగర్ ఆసుపత్రికి తరలించేలా సకాలంలో చర్యలు తీసుకొని మానవత్వం చాటుకున్నరు.