05-09-2025 10:57:40 PM
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): ముహమ్మద్ ప్రవక్త బోధనలు ఆచరణీయం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహమ్మద్ ప్రవక్త 1500 జయంతిని పురస్కరించుకుని సామాజిక కార్యకర్తల బృందం ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ నగరం లోని క్రౌన్ ఫంక్షన్ హాల్ లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై రక్తదానం శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని దానాలకన్నా రక్తదానం మిన్న అని చెప్పారు. అనంతరం రక్తదాతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు.