calender_icon.png 25 October, 2025 | 1:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డయల్ 100ను దుర్వినియోగం చేసిన వ్యక్తిపై చర్యలు

25-10-2025 12:00:00 AM

జహీరాబాద్, అక్టోబర్ 24 : డయల్ 100ను ఎవరైనా దుర్వినియోగం చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జహీరాబాద్ రూరల్ ఎస్త్స్ర కాశీనాథ్ హెచ్చరించారు. శుక్రవారం జహీరాబాద్ మండలం లచ్చనాయక్ తాండకు చెందిన మోహన్ సింగ్ అనే వ్యక్తి అనవసరంగా వందకు డయల్ చేసినందున అతన్ని తహసిల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు తెలిపారు. మోహన్ సింగ్ మందు తాగిన మైకంలో అనేకసార్లు 100కు డయల్ చేశాడని, తరచూ న్యూసెన్స్ చేస్తున్నందున జహీరాబాద్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చినట్లు తెలిపారు.

మరోసారి పునరావృతం అయితే ఆరు నెలల జైలు లేదా ఐదు లక్షల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని చెప్పి ఆరు నెలల కాలానికి సత్ప్రవర్తన కొరకు బాండ్ తీసుకోవడం జరిగిందన్నారు. ఆపదలో ఉన్నవారికి 100 డయల్ ఎంతో ఉపయోగపడుతుందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని ఎస్త్స్ర కాశీనాథ్ తెలిపారు.