calender_icon.png 26 October, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి సేవలు ఎనలేనివి

25-10-2025 12:00:00 AM

 ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

 నాగర్ కర్నూల్ అక్టోబర్ 24 ( విజయక్రాంతి )గ్రామీణ ప్రజలకు నాణ్యమైన కంటి వైద్యసేవలు అందించడంలో తుడుకుర్తి గ్రామంలోని కూచుకుల్ల రామచంద్రారెడ్డి ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి చేసిన సేవలు ఎనలేనివని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు.

తూడుకుర్తి గ్రామంలో జరిగిన కూచుకుళ్ల రామచంద్రా రెడ్డి కంటి ఆసుపత్రి 27వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూ ఎల్వీ ప్రసాద్ వంటి సంస్థలు వైద్యరంగంలో నిబద్ధతతో పనిచేసి ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతున్నాయి. ఆరోగ్య రంగం అభివృద్ధి చెందితేనే సమాజం ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి సిబ్బందిని అభినందించి, ఉచిత కంటి పరీక్షా శిబిరానికి ప్రారంభం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, వైద్యులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులుపాల్గొన్నారు