08-11-2025 01:19:18 AM
-ఫంక్షన్ హాళ్లు, శుభకార్యాల నిర్వాహకులకు హెచ్చరిక
-హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్
హుస్నాబాద్, నవంబర్ 7: ఫంక్షన్ హాళ్ల లో, శుభకార్యాల్లో స్టీల్ ప్లేట్లు వాడకపోతే 10వేల ఫైన్ వేస్తామని, ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని నిర్వాహకులను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ హెచ్చరించారు. మెప్మా ఆధ్వర్యంలో ఉన్న స్టీల్ బ్యాంకులను వినియోగించుకోవాలని సూచించారు. శుక్రవారం ఆయన మున్సిపల్ ఆఫీసులో ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశా రు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడు తూ.. హుస్నాబాద్ పట్టణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించేందుకు మున్సి పల్ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పట్టణంలోని అన్ని ఫం క్షన్ హాళ్లలోనూ ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించాలన్నారు. ప్రత్యామ్నాయంగా ఫంక్ష న్ హాళ్లు, శుభకార్యాలు నిర్వహించే వారు తప్పనిసరిగా మెప్మా ఆధ్వర్యంలో ఉన్న స్టీల్ బ్యాంకులను వినియోగించుకోవాలని సూ చించారు.
స్టీల్ వస్తువులను వినియోగించకుండా ప్లాస్టిక్ వాడినట్టు తేలితే ఆయా ఫం క్షన్ హాళ్ల నిర్వాహకులకు రూ.10 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. దీం తోపాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016, మున్సిపల్ చట్టం 2019, పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం చర్యలు కూడా తీసుకుంటామన్నారు. పర్యావరణ పరిరక్షణ, పట్టణ పరిశుభ్రత విషయంలో ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని తెలిపారు. ఈ సమావేశంలో సానిటరీ ఇన్‌స్పెక్టర్ బాల ఎల్లం, పర్యావరణ అధికారి రవికుమార్, ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు క్యాస రాము, లక్ష్మారెడ్డి, రాజయ్య, దేవేందర్ రెడ్డి, బత్తిని మహేందర్, కనకయ్య, క్రిస్టయ్య, టీఎల్‌ఎఫ్‌ఆర్ పీ సమత, జవాన్లు సారయ్య, ప్రభాకర్ పాల్గొన్నారు.