calender_icon.png 3 August, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

02-08-2025 12:13:08 AM

బెజ్జంకి, కొండపాక మండలాలలో పర్యటించిన జిల్లా కలెక్టర్

బెజ్జంకి/కొండపాక, ఆగస్టు 1: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులను హెచ్చరించారు.మండలంలో శుక్రవారం కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా పర్యటించారు. ఈ పర్యటనలో నూతన  ఇండ్ల నిర్మాణాలు, తహసీల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను , గుండారంలో ప్రభుత్వ పాఠశాలను ఆగ్రోస్ సెంటర్లోని స్టాక్ రిజిస్టర్ ని తానిఖి చేసి గోదాంలోని యూరియా బస్తాల నిల్వలను పరిశీలించారు.

ఈ సందర్భంగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని . ప్రభుత్వ పాఠశాలలో  మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేయాలని మండల అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి. అక్కడి వైద్య సదుపాయాలను పరిశీలించారు.

వైద్య సేవలపై రోగుల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. విధుల పట్ల  నిర్లక్ష్యం వస్తే చర్యలు తప్పవని అన్ని శాఖల అధికారులను హెచ్చరించారు. కలెక్టర్ వెంట మండల తాహాసిల్దార్ చంద్రశేఖర్, వ్యవసాయ అధికారి సంతోష్, మండల విద్యాధికారి, ఎంపీఓలు వున్నారు.

కలెక్టర్ కు వినతి పత్రం అందజేత

నూతన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అవసరమైన మట్టిని ప్రభుత్వం అనుమతించాలని, అక్రమ మట్టిని రవాణా చేస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు సంగెం మధు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.

మండల పరిధిలోని చిల్లాపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సరిపడా గదులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, అదనపు గదుల నిర్మాణం చేయాలని కాంగ్రెస్ యువజన నాయకులు మానల రవి, శ్రావణ్ లు వినతి పత్రం అందజేశారు. 

ఇల్లు నిర్మించుకోకపోతే పేరు తొలగించండి

శుక్రవారం జిల్లా కలెక్టర్ కొండపాక తహసిల్దార్, మండల పరిషత్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూభారతి ద్వారా స్వీకరించిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని తహసిల్దార్ ను ఆదేశించారు.

ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులు చేపట్టకపోతే వారి పేర్లు తొలగించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇతరులకు అవకాశం కల్పించాలని ఎంపీడీవోని ఆదేశించారు. మండలంలో సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు.