02-08-2025 12:11:11 AM
సిద్దిపేట క్రైమ్, ఆగస్టు 1 :ఆపరేషన్ ముస్కాన్ - 11 లో భాగంగా జూలైలో 94 మంది పిల్లలను వారి తల్లిదండ్రులు, బంధువులకు అప్పగించినట్లు పోలీస్ కమిషనర్ బి.అనురాధ తెలిపారు. వారిలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గడ్, బీహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మేఘాలయ రాష్ట్రాలతోపాటు నేపాల్ కు చెందిన 84 మంది బాలురు, 10 మంది బాలికలు ఉన్నారని పేర్కొన్నారు.
వారితో పని చేయించుకుంటున్న జిల్లాలోని 27 మంది పై కేసులు నమోదు చేసినట్టు ఆమె చెప్పారు. ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం చేసిన నోడల్ అధికారి సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఏసీపీ రవీందర్, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ మల్లేశం గౌడ్ తో పాటు వివిధ శాఖల అధికారులను పోలీస్ కమిషనర్ అభినందించారు.
ఎక్కడైనా బాల బాలికలతో ఎవరైనా పనిచేయించినట్లు కనబడితే డయల్ 100, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలనిసూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని కమిషనర్ తెలిపారు.