calender_icon.png 2 August, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహకార సంఘాలకు డివిడెండ్

02-08-2025 12:13:16 AM

నిజామాబాద్ డీసీసీబీ  అధ్యక్షుడు రమేష్‌రెడ్డికి సన్మానం

హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): ఇటీవల జరిగిన నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు 103వ వార్షిక మహాజన సందర్భంగా సహకార సంఘాలకు డివిడెండ్ ప్రకటించి, ఖాతాలలో జమచేశారు. అందుకు కృతజ్ఞతగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడు కుంట రమేష్‌రెడ్డిని శుక్రవారం సహకార సంఘాల యూనియన్ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మన బ్యాంకు గౌరవ అధ్యక్షుడు రమేష్‌రెడ్డి జిల్లా సహకార వ్యవస్థ అభివృద్ధికి అంకితభావంతో సేవలు అందిస్తున్నారని కొనియాడారు.

నిరర్ధక ఆస్తులను గణనీయంగా తగ్గించి, వీక్ బ్యాంక్ స్టేటస్ తొలగించి, ప్రస్తుతం రాష్ట్ర సహకార రంగం జిల్లా వైపు చూసేలా చేసి, గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా సహకార సంఘాలకు డివిడెండ్ ప్రకటించారు అని చెప్పారు. ఇది రమేష్‌రెడ్డి పనితీరుకు నిదర్శనం అని పేర్కొన్నారకు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నల్ల చంద్రశేఖర్‌రెడ్డి, డైరెక్టర్లు లింగయ్య, రమేష్ పాటిల్, బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగభూషణం వందే పాల్గొన్నారు.