19-08-2025 06:53:03 PM
జిల్లా వ్యవసాయ అధికారి శత్రునాయక్
లక్షెట్టిపేట,(విజయక్రాంతి): ఎరువులను రైతులకు అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవు అని జిల్లా వ్యవసాయ అధికారి శత్రునాయక్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఫర్టిలైజర్ షాపులను ఆకస్మిక తనిఖీ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి శత్రు నాయక్ మాట్లాడుతూ... యూరియా సరిపడా రైతులకు అందుబాటులో ఉంచామని అన్నారు. ఎవరైనా డీలర్స్ ఎరువులను అధిక ధరలకు విక్రయించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీలర్లు విధిగా స్టాక్ బోర్డ్ అప్డేట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
రైతులు వారి అవసరం మేర మాత్రమే ఎరువులు తీసుకోవాలని, పంట కాల మొత్తానికి అవసరమైన ఫర్టిలైజర్ ఒకేసారి తీసుకోవడం వల్ల మిగతా రైతులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. యూరియా అవసరానికి మించి వాడడం వల్ల చీడపీడలు వచ్చే ప్రమాదం ఉంటుందని తెలియజేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జెండా వెంకటాపూర్, ఇటిక్యాల, గుల్లకోట ద్వారా 300 టన్నుల యూరియాను రైతులకు ఇదివరకే పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.