19-08-2025 06:55:29 PM
సిపిఐ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ దుబాస్ రాములు
బాన్సువాడ,(విజయక్రాంతి): సిపిఐ పార్టీ నాలుగవ రాష్ట్ర మహాసభలు ఈ నెల 20. ,21,22..తేదీలలో మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో మూడు రోజులపాటు జరగనున్న మహాసభలను జయప్రదం చేయాలనీ సిపిఐ పార్టీ బాన్సువాడ నియోజకవర్గం పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఈ రాష్ట్ర మహాసభలకు జాతీయ నాయకులు, సిపిఐ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ, మాజీ పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్యేలు ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ మహాసభలో గత కార్యక్రమాలను సమీక్ష చేసుకొని నూతన ఎజెండాతో పార్టీ బలోపేతం కొరకు భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకుంటిందని ఆయన తెలిపారు.