calender_icon.png 19 August, 2025 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హథిరాం బావాజీ మఠం భవన నిర్మాణం కూల్చివేత టెండర్ ను వెంటనే రద్దు చేయాలి

19-08-2025 06:48:56 PM

మఠంపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న లంబాడీల ఆరాధ్య దైవం హతీరాం బావాజీ మఠం భవన నిర్మాణం కూల్చివేత టెండర్ ను వెంటనే రద్దు చేయాలని మఠంపల్లి మండల లాలి తండా గ్రామానికి చెందిన సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షులు భూక్యా బాలు నాయక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పాత్రీకేయులతో మాట్లాడుతూ... బంజారా సాధువులు విద్యార్థులు మేధావులు హథిరాం బావజీ భక్తులు అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని, ఇది కేవలం ఒక భవనం కోల్పోవడం కాదు ఇది తరతరాలుగా మనకు భాగస్వామ్యమైన పవిత్ర దేవాలయం నుండి మన గుర్తింపును, సంస్కృతినీ, చరిత్ర  ను చెరిపివేయడమని,మనం మౌనంగా ఉండడం వలన మన కమ్యూనిటీకి, అలాగే సాంస్కృతిక సాంప్రదాయ వైవిధ్యాన్ని కాపాడాలని అందరూ ఏకతాటిపైకి వచ్చి స్వరాన్ని వినిపించి, హతిరాం బావాజి మఠాన్ని కాపాడుకోవాలని కోరారు.