calender_icon.png 29 January, 2026 | 11:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లా అండ్ ఆర్డర్ అతిక్రమిస్తే చర్యలు

29-01-2026 12:48:35 AM

పెబ్బేరు ఎస్‌ఐ యుగంధర్ రెడ్డి

పెబ్బేరు, జనవరి 28 : మున్సిపల్ ఎన్నికల వేళ ఎవరైనా సరే లా అండ్ ఆర్డన్ను అతిక్రమిస్తే చర్యలు కఠిణంగా ఉంటాయని పెబ్బేరు ఎస్త్స్ర యుగంధర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. మంగళవారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి నందున ఎవరైనా వ్యక్తులు రూ.50 వేల కంటే ఎక్కువ మొత్తంలో తీసుకువెళ్తే తప్పనిసరిగా వాటికి సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉంచుకోవాల్సి ఉంటుంది. లేనిచో అట్టి డబ్బులను సీజ్ చేయడానికి వెనుకాడబోమని చెప్పారు.

అంతేకాక పార్టీల మీద కానీ, పార్టీలకు చెందిన వ్యక్తుల పైన గాని, మరే ఇతర వక్తుల పైన గాని విమర్శలు చేస్తున్నట్టు వాట్సాప్ గ్రూప్ లలో ఏదైనా మెస్సెజ్ లు పోస్ట్ చేసినా లేదా ఫార్వర్డ్ చేసినా అట్టి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, అంతేకాక అట్టి వాట్సప్ గ్రూపులకు సంబంధించిన అడ్మిన్ ఎవరైతే ఉంటారో వారిపై కూడా కేసు నమోదు చేయడానికి సంశయించబోమని హెచ్చరించారు.