29-01-2026 12:47:04 AM
మహబూబ్ నగర్, జనవరి 28 ( విజయ క్రాంతి ) : జిల్లాలోని ఒక కార్పొరేషన్ రెండు మున్సిపాలిటీలకు నామినేషన్లు స్వీకరించారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ 60 డివిజన్లకు సంబంధించి తొమ్మిది మంది నామినేషన్లు దాఖలు చేయగా, భూత్పూర్ మున్సిపాలిటీలోని 10 కౌన్సిలర్లకు సంబంధించి 1 నామినేషన్, దేవరకద్ర మున్సిపాలిటీలో 12 స్థానాలకు సంబంధించి నాలుగు నామినేషన్లను దాఖలు చేశారు. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, జిల్లా ఎస్పీ డి జానకి లతోపాటు సంబంధిత అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు చేపడుతున్నారు.