3 April, 2026 | 3:47 PM

Breaking News

గ్రామీణ క్రీడలకు వేదికగా జేపీఎల్   •   రాష్ట్రంలో మూడు రోజులు మోస్తరు వర్షాలు   •   సాధ్వి నిరంజన్ జ్యోతి జీని కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బక్రీ   •   'మార్పురావాలంటే.. రేవంత్ రెడ్డి పోవాలి'— మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గంజాయి సేవించడం నేరం   •   దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు   •   TN Polls: 27 మందితో బీజేపీ అభ్యర్థుల జాబితా.. బరిలో దిగిన తెలంగాణ మాజీ గవర్నర్   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తిమ్మాయ్య గారి సుభాష్ రెడ్డి   •   ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తాం: ట్రంప్ బెదిరింపులు   •   TRS పేరుతో కవిత పార్టీ..! పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు   •  

చురుగ్గా నైరుతి రుతుపవనాలు

27-09-2024 01:24 AM

రెండు రోజులు వర్షాలు

ఎల్లో అలర్ట్ జారీ 

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మహారాష్ట్ర తీరంలో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైందని, దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో రెండు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షా లు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. వర్ష సూచన ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, నిజామాబాద్, జగిత్యా ల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రా ద్రి, ఖమ్మ, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడుతాయని చెప్పింది. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.