3 April, 2026 | 1:41 PM

Breaking News

కొండాపూర్‌లో డ్రగ్స్ కలకలం.. పబ్‌లో సినీనటి హేమ   •   బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ — అమ్మవారి జాతరకు వెళ్లొస్తూ ముగ్గురు దుర్మరణం   •   తూప్రాన్‌లో శ్రీరాముడి రథోత్సవం.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య వివాదం   •   దొడ్డి కొమరయ్య... నేటి ప్రజావ్యతిరేక పోరాటలకు స్పూర్తి: కేసీఆర్   •   బహుజన ఆత్మగౌరవ ప్రతీక దొడ్డి కొమురయ్య   •   దక్షిణాసియా వస్త్ర రాజధానిగా తెలంగాణ — సీఎం రేవంత్ రెడ్డి   •   కలెక్టర్ ఆదేశాలు బే ఖాతర్   •   Warangal Sub-Registrar Officeలో సోదాలు.. అక్రమాల గుట్టు విప్పిన ఏసీబీ   •   సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం... గ్రూప్-1 ఆశావహులకు ఇది పెద్ద ఊరట   •   ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా భూక్యా రవి కుమార్ నాయక్   •  

నేడు ప్రవాసీ ప్రజావాణి ప్రారంభం

27-09-2024 01:27 AM

విదేశాంగశాఖతో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): గల్ఫ్ వలస కార్మికులకు ఓదార్పు, మనోధైర్యం కల్పించేందుకు రాష్ట్రం ప్రభుత్వం ముందుకొచ్చింది. విదేశాల్లో పనిచేసే కార్మికుల బాధలను వారి కుటుంబసభ్యులు విన్నవించేందుకు శుక్రవారం హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్‌లో ‘ప్రవాసీ ప్రజావాణి’ని ప్రభుత్వం ప్రారంభించనున్నది. ‘ప్రవాసీవాణి’కి ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. విదేశాంగ శాఖ సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. శుక్రవారం ప్రారంభం కానున్న ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమ ఏర్పాట్లను ఎన్నారై ప్రతినిధులు డాక్టర్ వినోద్‌కుమార్, మంద బీమ్‌రెడ్డి, బొజ్జ అమరేందర్‌రెడ్డి, గంగసాని నవీన్, చెన్నమనేని శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, విప్ ఆది శ్రీనివాస్, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.