calender_icon.png 4 October, 2025 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పేరిట రాజన్న ఆలయాన్ని మూసివేస్తే ఊరుకునేది లేదు

04-10-2025 08:21:03 PM

హిందూ మనోభావాలను దెబ్బతీసేందుకు ఇది పెద్ద కుట్ర..

ఆలయాన్ని మూసివేస్తే వేలాదిమంది హిందువులతో ఆందోళనలు..

పునర్నిర్మాణంలో దర్గాను తరలించండి.. హిందువులకు విముక్తిని కల్పించండి..

ముస్లిం మసీదులలో ఎక్కడైనా హిందువుల యొక్క సమాధులు ఉన్నాయా..!

మరి రాజన్న ఆలయంలో దర్గా ఎందుకు..?

బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఫైర్..

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా రాజన్న ఆలయాన్ని మూసివేస్తే ఊరుకునేది లేదని బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డిబోయిన గోపి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వేములవాడ రూరల్ బిజెపి పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పేరిట ఆలయాన్ని మూసివేసే పెద్ద కుట్ర జరుగుతుందని ఇది హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఆయన దుయ్యబట్టారు. సుమారు వందల కోట్లతో కాశి, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాల పునర్నిర్మానంలో అభివృద్ధి పనులు చేసినప్పుడు భక్తులకు దర్శనాలు నిలిపి వేయలేదని, మరి రాజన్న ఆలయంలో దర్శనాలు ఎందుకు బందు చేస్తున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు.

అంతేకాకుండా ఎక్కడైనా ముస్లిం మసీదులలో హిందువుల యొక్క సమాధులు ఉన్నాయా, మరి రాజన్న ఆలయంలో దర్గా ఎందుకని ఆరోపించారు. వెంటనే పునర్నిర్మాణంలో భాగంగా దర్గాను ప్రత్యేక చోటుకు తరలించాలని లేకుంటే బిజెపి పార్టీ పక్షాన కోరుకునేది లేదని వ్యాఖ్యానించారు. బిజెపి పార్టీ ఎప్పుడూ కూడా ఆలయాల అభివృద్ధికి వ్యతిరేకం కాదని, ప్రభుత్వం హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించకుండా అభివృద్ధి పనులు చేసుకుంటూ పోవాలని సూచించారు. లేకుంటే రానున్న రోజుల్లో వేలాదిమంది హిందూ సోదరులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని బిజెపి జిల్లా అధ్యక్షుడు గోపి మరోసారి హెచ్చరించారు. ఈ సమావేశంలో వేములవాడ రూరల్ బిజెపి పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.