calender_icon.png 18 October, 2025 | 10:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలి

18-10-2025 01:16:43 AM

 ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 

జడ్చర్ల, అక్టోబర్ 17: కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ సత్తాను చాటాలని, ప్రతీ గ్రామంలోనూ విజయకేతనాన్ని ఎగురవేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పిలుపునిచ్చారు. డీసీసీ ఎన్నికలపై అభిప్రాయాలను సేకరించడం కోసం కాంగ్రెస్ అధిష్టానం నిర్వహిస్తున్న సంఘటన్ సృజన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త తన బలమని చెప్పారు కార్యకర్తలు కూడా ప్రజాదరణ చూరగొని.

పార్టీకి విజయాలను అందించడంలో తనకు అండగా నిలవాలని కోరారు.  ప్రతి కార్యకర్త కష్టపడాలని, గడచిన 22 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. నియోజకవర్గంలో విద్యుత్ కొరతను నివారించేందుకు ఇప్పటికే 21 సబ్ స్టేషన్లు మంజూరు చేయించాననీ ప్రస్తావించారు.అదేవిధంగా ఆర్ అండ్ బీ, పంచాయితీ రాజ్, ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా రోడ్లు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అబ్జర్వర్, కర్ణాటక ఎంఎల్సీ ఎం. నారాయణస్వామి, టిపీసీసీ అబ్జర్వర్ లుగా రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, జాకీర్ ఉస్మాన్, జిల్లా పార్టీ అధ్యక్షులు దేవరకద్ర శాసనసభ్యులు జి. మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ చైర్మన్, మార్కెట్ చైర్పర్సన్, కౌన్సిలర్లు,మాజీ సర్పంచులు, పార్టీ కార్యకర్తలు, యువజన,మహిళా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.