calender_icon.png 19 October, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ సరఫరాకు అంతరాయం

18-10-2025 09:23:24 PM

కల్వకుర్తి రూరల్: గుండూరు విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని పలు గ్రామాల్లో ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని కల్వకుర్తి విద్యుత్ శాఖ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపకేంద్రంలో అత్యవసర మరమ్మతు పనులు చేపట్టనున్నందున ఈ అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుమారు 8 గంటల పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు తెలిపారు. గుండూరు, లింగసానిపల్లి, రఘుపతిపేట, ముకురాల, పంజుగుల, సుద్ధకల్ గ్రామాలలో విద్యుత్ ఉండదని స్పష్టం చేశారు. ఈ గ్రామాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు ఈ మార్పును గమనించి, మరమ్మతు పనుల సమయంలో విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించగలరని విజ్ఞప్తి చేశారు.