18-10-2025 09:05:53 PM
ప్రతిభను చాటుకున్న విద్యార్థులు
సూర్యాపేట,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి విద్యాలయంలో గోసేవా విభాగం ఆధ్వర్యంలో శనివారం జిల్లాస్థాయి గోవిజ్ఞాన పరీక్షలు- 2025, లెవెల్-2 లో దాదాపు 25 పాఠశాలలకు చెందిన 150 విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సరస్వతి విద్యా పీఠం నల్గొండ విభాగ్ కార్యదర్శి యానాల వెంకట్ రెడ్డి పాల్గొని మాట్లాదారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గోమాత మూత్రం ఉపయోగాలు, గోమాత నుండి వచ్చే వ్యర్ధాలను వర్మి కంపోస్ట్ గా మార్చుకునే విధానం, గోమాత నుండి వచ్చే పాలు, పెరుగు, నెయ్యి మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో వాటి గురించి వివిధ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు చాలా చక్కగా రాసి విజేతలుగా నిలవడం అభినందనీయమని అన్నారు. ఈ పరీక్షలో మొదటి బహుమతిగా సిటీ టాలెంట్ విద్యార్థులు, రెండవ బహుమతి సృజన పాఠశాల విద్యార్థి గెలుచుకున్నారు.