18-10-2025 09:16:59 PM
గాంధీభవన్ లో అంజయ్య వర్ధంతి వేడుకల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు
మంథని,(విజయక్రాంతి): ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అంజయ్య సేవలు మరువలేనివని ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు అన్నారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య వర్ధంతి సందర్భంగా శ్రీను బాబు, మాజీ కేంద్ర మంత్రి సీపీ జోషి తో కలిసి అంజయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంజయ్య సేవలను స్మరించుకుంటూ ముఖ్యమంత్రి గా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో చేసిన సేవలను శ్రీను బాబు కొనియాడారు.