18-10-2025 09:28:01 PM
చర్ల,(విజయక్రాంతి): మండలంలోని తేగడ గ్రామపంచాయతీ నందు పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నితీక చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా పారిశుద్ధ్య కార్మికుల జీవితాలలో వెలుగు నింపాలనే ఉద్దేశ్యంతో దీపావళి కానుకగా చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ మెడికల్ వింగ్ డైరెక్టర్ కుప్పాల నిఖిల్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల స్వచ్ఛత కోసం నిరంతరం శ్రమిస్తూ గ్రామాలను శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివాని వారి కృషి ప్రశంసనీయమని ఆయన అన్నారు.
నితీక చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ప్రసన్న కంజర్ల పారిశుద్ధ్య కార్మికులకు దీపావళి కానుక గా చీరలను పంపిణీ చేయడం అభినందనీయం మని వారి పర్యవేక్షణలో నితీక చారిటబుల్ ఫౌండేషన్ దినదినాభివృద్ధి చెందుతూ మరెన్నో సేవా కార్యక్రమాలను చేపట్టాలని ఆయన అన్నారు. అలాగే డైరెక్టర్స్ భవ్య రెడ్డి సింధు ఆరుట్ల భాగస్వామ్యంతో భవిష్యత్తులో నితీక చారిటబుల్ ఫౌండేషన్ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ నిరుపేద బడుగు బలహీన వర్గాల వారికి చేదోడు వాదోడుగా ఉంటూ సేవా కార్యక్రమాలలో ముందుకు సాగాలని ఆయన అన్నారు.