18-10-2025 09:09:36 PM
సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. యువరాజా
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో వయోవృద్ధుల సంక్షేమం కోసం జిల్లా కేంద్రంలోని రాజస్వ మండల అధికారి కార్యాలయంలో న్యాయ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. యువరాజా తెలిపారు. శనివారం రాజస్థాన్ మండల అధికారి లోకేశ్వర్ రావుతో కలిసి న్యాయ సేవల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ ట్రిబ్యునల్స్ ఎస్టాబ్లిష్డ్ అండర్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ ఆక్ట్ 2007 క్రింద వయోవృద్ధుల సంక్షేమం కోసం జిల్లాలో న్యాయ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
వయవృద్ధులు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించేందుకు ఈ కేంద్రం ద్వారా కృషి చేయడం జరుగుతుందని, ఇందు కొరకు పానెల్ న్యాయవాదిగా కుడ్క కిషోర్, పారా లీగల్ వాలంటీర్ గా సునర్కర్ లింగయ్య లను నియమించడం జరిగిందని తెలిపారు. ప్రతి శనివారం ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రం ద్వారా సేవలు పొందవచ్చని తెలిపారు. చట్టం లోని అంశాలను వయోవృద్ధులకు వివరించడం జరుగుతుందని, అవసరమైన సలహాలు, సూచనలు అందించడం జరుగుతుందని తెలిపారు.