calender_icon.png 19 October, 2025 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

18-10-2025 09:01:16 PM

- రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

- పంచాయతీ రాజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన విప్

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): వేములవాడ నియోజకవర్గ పరిధిలో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ప్రభుత్వ విప్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో గల ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రోడ్లు, పలు పనుల తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ పరిధిలో నిర్మాణంలో ఉన్నాఆ రోడ్లు,ఇప్పటికి ప్రారంభించని పనులు, సిఆర్ఆర్, ఎంఆర్ఆర్ పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు విప్ సూచించారు.