calender_icon.png 19 October, 2025 | 12:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొలిమి కుంటగౌడ సంఘానికి భూమి విరాళం

18-10-2025 09:21:03 PM

చొప్పదండి,(విజయక్రాంతి): చొప్పదండి మండల కేంద్రంలోని కొలిమి కుంట గ్రామానికి కరీంనగర్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు శ్రీ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ తన స్వగ్రామం కొలిమికుంట యందు గల సొంత భూమి సర్వే నంబర్ 276 బిలో ఒక గుంట భూమిని తన తల్లి గారైన కీర్తిశేషులు తాళ్లపల్లి జననమ్మ జ్ఞాపకార్థం కొలిమికుంట గ్రామ గీతా పారిశ్రామిక సహకార సంఘానికి దానం ఇవ్వడం జరిగింది. గ్రామ గౌడ సంఘ సభ్యులు సంఘ భవనం కోసం తన సొంత భూమి ఇవ్వడం గొప్ప విషయమని కొనియాడినారు.ఇందుకు గాను గ్రామ గౌడ సంఘం సభ్యులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ గారిని సన్మానించినారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపినారు.