షూటింగ్ కారవాన్లలో హిడెన్ కెమెరాలు.. నటి రాధికా శరత్ కుమార్
చెన్నై: నటి రాధిక హేమ కమిటీ రిపోర్ట్ పై స్పందించారు. మళయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా చాలా ఇండస్ట్రీలలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయన్నారు.కొంతమంది వ్యక్తులు నటీమణుల కారవాన్లలో లేడీస్ ని చిత్రీ కరించేందుకు హిడెన్ కెమెరా ద్వారా వచ్చిన వీడియోలు బయటపడ్డాయని ఆమె ఆరోపించారు.
షాట్ ముగించుకుని వస్తున్నా కొంత మంది మగవాళ్లు ఒక చోట గుమిగూడి మొబైల్ లో వీడియోలను చూస్తూ నవ్వుకుంటున్నారు. షూటింగ్ సిబ్బంది తాలూకు ఒక వ్యక్తిని పిలిచి అడిగాను. కారవాన్లలో లేడీస్ ని చిత్రీ కరించి హిడెన్ కెమెరా కెమెరా ద్వారా వచ్చిన వీడియోలు అతడి ల్యాప్ ట్యాప్, మొబైల్‌ను స్వాధీనం చేసుకొమ్మని చెప్పా.. వాళ్లందరికీ వార్నింగ్ ఇచ్చా అన్నారు. కాగా, ఖుష్బూ ఈ రిపోర్ట్‌పై మాట్లాడుతూ కెరీర్ లో రాణించడానికి వేధింపులు కమిట్ మెంట్ లు అన్ని రంగాల మహిళలకు ఎదురు కావడం విచారకరం అన్నారు. ఇలాంటి సంఘటనలకు తట్టుకోలేక పలువురు నటీమణులు ఆత్మహత్య చేసుకున్నారని నటి కుట్టి పద్మిణి పేర్కొన్నారు.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో లేడీస్ హాస్టల్ సీక్రెట్ కెమెరాల కలకలం నేపథ్యంలో హేమ కమిటీ రిపోర్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కెమెరా ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు. ఈ విషయం తెలుసుకొని కాలేజీ హాస్టల్‌కు చేరుకున్న పోలీసులు, ఆరోపణలు వచ్చిన ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.వారం క్రితమే వెలుగులోకి వచ్చినా కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.






