8 May, 2026 | 8:12 AM

బ్రెజిల్ లో "మస్క్" సంస్థ 'ఎక్స్'.. ట్విట్టర్ పై.. బ్యాన్!

31-08-2024 12:07 PM

బ్రసీలియాయూఎస్ వ్యాపార దిగ్గజం ఎక్స్ (ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్ కు బ్రెజిల్ సుప్రీంకోర్టు లో ఎదురు దెబ్బ తగిలింది. ఎక్స్ సంస్థకు మొట్టికాయి వేసి షాకిచ్చింది. బ్రెజిల్ లో ఎక్స్ పై నిషేధం విధించింది. స్థానికంగా తమ దేశంలో ఓ ప్రతినిధిని నియమించేందుకు మస్క్ నిరాకరించడంతో ఈ ఆదేశాలు జారీచేసినట్లు పేర్కొంది. నిషేధపు ఉత్తర్వులను ఉల్లంఘించి వీపీఎన్ ద్వారా ఎక్స్ ను ఉపయోగిస్తే తగు మొత్తంలో జరిమానా విధిస్తామని కోర్టు హెచ్చరించింది. సుమారు 40 మిలియన్ల పాపులేషన్ ఉన్న బ్రెజిల్ లో 80 లక్షల మంది ఎక్స్  వినియోగదారులు న్నారు. సదరు నెటిజనులు నెలకు ఒకసారైనా ఎక్స్ లో పోస్టులు పెట్టడం, కామెంట్లు పెట్టడం చేస్తుంటారని ఓ సర్వే వెల్లడించింది.

బ్రెజిల్ లో ఎక్స్ రంగ ప్రవేశం చేసిన తర్వాత నుంచి ఇప్పటి వరకూ కంపెనీ తరఫున ప్రతినిధిని నియమించలేదు. స్థానిక జ్యూరిడిక్షన్ పరిధిలో ఏర్పడే వ్యాజ్యాలు,  న్యాయవివాదాలను పరిష్కరించుకోవడానికి లీగల్ రిప్రజెంటేటివ్ ను నియమించాలని బ్రెజిల్ సుప్రీంకోర్టు ఎక్స్ కు సూచించింది. అయితే, ఈ సూచనను మస్క్ కంపెనీ పెడచెవిన పెట్టింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఎక్స్ సేవలను దేశంలో నిలిపివేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

కొస మెరుపు..

ఇలా ఎక్స్ ట్విట్టర్ పై నిషేధం కొత్త కాదంటున్నారు న్యాయ శాస్త్ర పండితులు గతంలో సైతం పలు స్థానిక ప్రభుత్వాలతో వివాదాల కారణంగా కొన్ని దేశాలు ఎక్స్ పై బ్యాన్ విధించాయి. అలా నిషేధించిన  దేశాలు  చైనా, ఇరాన్, తుర్కెమిస్థాన్, నార్త్ కొరియా, ఉజ్బెకిస్థాన్, రష్యా, మయన్మార్ ఈ జాబితాలో ఉండగా తాజాగా బ్రెజిల్ సైతం కొరడా ఝలిపించిందని వారు విశ్లేషిస్తున్నారు.