29-07-2025 11:34:29 AM
హైదరాబాద్: రంగారెడ్డి మొయినాబాద్-కనకమామిడిలోని బ్రౌన్ టౌన్ రిసార్ట్(Brown Town Resort)లో తెలుగు నటి కల్పికా గణేష్(Kalpika Ganesh) హంగామా చేసింది. మధ్యాహ్నం మూడు గంటలకు క్యాబ్లో సింగిల్ గా వచ్చిన కల్పిక రిసార్ట్ రిసెప్షన్ లోకి రాగానే మేనేజర్ కృష్ణ పై దురుసుగా ప్రవర్తించింది. మెనూ కార్డ్ విసిరేయడం, రూమ్ కీస్ మొహంపై విసిరేసి బూతు పురాణాలతో రెచ్చిపోయింది. సిగరెట్స్ కావాలంటూ బ్రౌన్ టౌన్ రిసార్ట్స్ సిబ్బందిపై దుర్భాషలాడింది. 40 నిమిషాలు రిసార్ట్ లో కల్పిన న్యూసెన్స్ క్రియేట్ చేసినట్లు రిసార్ట్ యాజమాన్యం పేర్కొంది. కల్పిక ప్రవర్తనపై రిసార్ట్ సిబ్బంది ఆశ్చర్యానికి గురైంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కాలేదని రిసార్ట్ సిబ్బంది తెలిపారు.
కాగా, బ్రౌన్ టౌన్ రిసార్ట్ లో జరిగిన హంగామా పై కల్పిక(Telugu actress Kalpika)స్పందించారు. సిగరెట్లు కావాలని అడిగితే రిసార్ట్ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించారు. రిసార్టులో సెల్ ఫోన్లో సిగ్నల్స్ లేవని, కనీసం క్యాబ్ బుక్ చేసుకునేందుకు వైఫై కూడా లేదని అడిగితే నాతో మేనేజర్ వాగ్వాదానికి దిగాడు. ఎంత నిదానంగా చెప్పినా వినకపోవడంతో, మేనేజర్‌తో గొడవకు దిగాల్సి వచ్చిందని సినీ నటి కల్పిక పేర్కొంది. పోలీసులు వివిధ కేసులో తన వెంట పడుతున్నారని తాను రిసార్ట్ కి వచ్చినట్లు తెలిపింది.