నటి స్నేహా ఉల్లాల్ పుట్టినరోజు నేడు
18-12-2024 12:00 AM
నటి స్నేహా ఉల్లాల్ పుట్టినరోజు నేడు. ఆమె 1985 డిసెం బర్ 18న మస్కట్‌లో జన్మించారు. 2005లో హిందీ చిత్రం ‘లక్కీ: నో టైమ్ ఫర్ లవ్’ ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటించింది. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత ఆమె నటించిన ‘నేను మీకు తెలుసా’ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 2010లో ‘సింహా’లో బాలకృష్ణ సరసన నటించింది.






