calender_icon.png 18 July, 2025 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జల వనరుల రక్షణ దిశగా అడుగులేద్దాం

18-07-2025 05:51:38 PM

జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు

పెన్ పహాడ్ : జల వనరుల రక్షణ దిశగా అడుగులేద్దామని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు పిలుపు నిచ్చారు. శుక్రవారం మండల పరిధిలోని అనంతారంలో జరుగుతున్న నీటి సంరక్షణ పనులను ఆయన పరిశీలించి గ్రామస్థులను ఉద్దేశ్యించి మాట్లాడారు. నీటి వృదాను తగ్గించడంతో పాటు ప్రతి ఇంట్లో విధిగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం, కమ్యూనిటీ, డ్రైనేజీ, బోర్వెల్, రూప్ వాటర్ భూమిలో ఇంకుడు గుంతల ద్వారా నిల్వ చేసుకోవాలన్నారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్న లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు పేమెంట్లు చేయాలని సూచించారు.  అంతేకాకుండా మండల కేంద్రములోని తహసీల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి భూభారతి, నూతన రేషన్ కార్డులకు సంబంధించి ఆరా తీశారు. నూతన రేషన్ కార్డుల పంపిణి త్వరితగతిన ప్రారంభించాలన్నారు.