calender_icon.png 18 July, 2025 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు, బైక్ ఢీకొని మహిళ మృతి..

18-07-2025 05:47:17 PM

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): వేగంగా వస్తున్న కారు, బైక్ ఒకదాని తర్వాత మరొకటి మహిళను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన రేణుక (43) బాచుపల్లిలోని బోనాలు పండగ సందర్భంగా తన కూతురు ఇంటికి వెళ్తుంది. ఈ క్రమంలోనే బాచుపల్లి విఎన్ఆర్ కాలేజ్ ఎదురుగా రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని బైక్ ఢీకొట్టి తరువాత కారు ఢీ కొట్టడం తో రేణుక అక్కడికక్కడే మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి కి తరలించారు. ఈ మేరకు బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.