02-05-2025 11:29:32 PM
జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్
మంచిర్యాల,(విజయక్రాంతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 332 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి నాణ్యమైన వరిధాన్యం కొనుగోలు చేస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్ సభావాత్ మోతిలాల్ అన్నారు. కొనుగల్ కేంద్రాలను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. తాలు, తప్పలేని నాణ్యమైన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 154 కొనుగోలు కేంద్రాల ద్వారా 3,818 మంది రైతుల వద్ద 33 వేల 740 టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలలో 13 కోట్ల 43 లక్షల రూపాయలు జమ చేశామన్నారు. నాణ్యమైన వరిధాన్యంను రైతులు కొనుగోలు కేంద్రా-లకు తీసుకువచ్చి కనీస మద్దతు ధర పొందాలని, సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయలు అదనపు బోనస్ పొందాలన్నారు. కరీంనగర్ లోని 26 మిల్లులకు, జిల్లాలోని 16 మిల్లులకు తరలించడం జరుగుతుందని తెలిపారు. అకాల వర్షాల సమయంలో కేంద్రాలలో అందుబాటులో ఉన్న టార్పాలిన్లను వినియోగించుకోవాలని సూచించారు.