calender_icon.png 4 May, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు వైద్య సేవలు

03-05-2025 12:00:00 AM

  1. గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య

కంకోల్లో పీహెచ్‌సీ ప్రారంభం 

మునిపల్లి, మే 2 :  ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు అందుబాటులో వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అంజయ్య, ఇంచార్జి డీఎంహెచ్వో గాయత్రిదేవిలు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం  కంకోల్ లో రూ.2.45 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న పీహెచ్ సీ సెంటర్ నిర్మాణ దశలో ఉండడంతో   ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ్మ దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో  మంత్రి స్పందించి వెంటనే  కంకోల్లో  తాత్కాలిక భవనాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో వైద్య సేవలందించాలని సంబంధిత శాఖ అధికారులను  ఆదేశించారు. ఈ మేరకు  శుక్రవారం నాడు కంకోల్ గ్రామంలో  తాత్కాలిక భవనాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రిగా దామోదర్ రాజనర్సింహ్మ ఉండడంతో ప్రజలకు వైద్య సేవల్లో ఇబ్బందులు లేకుండా ఉన్నాయన్నారు.

అలాగే  నూతన భవనం  పూర్తయ్యే వరకు  ఈ తాత్కాలిక భనవంలో వైద్య  సేవలు  కొనసాగుతాయన్నారు. నూతన భవనం  పూర్తయితే నాలుగు సబ్ సెంటర్లకు గాను  16 గ్రామాల ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంటుందన్నారు. ముఖ్యంగా ఈ తాత్కాలిక సెంటర్ లో మహిళా డాక్టర్ తో పాటు ఎల్టీ డాక్టర్ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 4:00 వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్‌ఓ సునంద, డిఐఓ మనోహర్ రెడ్డి, రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, ఎంపీడీవో డాక్టర్ హరినందన్ రావు, వైద్య అధికారులు సంధ్యారాణి, రవి, పిఎసిఎస్ చైర్మన్ పద్మ దుర్గయ్య, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, పి హెచ్ ఎన్ చంద్రబాను, పి హెచ్ సి సూపర్వైజర్ విజయలక్ష్మి, ఏపీఓ యాదగిరి, పంచాయతీ కార్యదర్శి సంతోషమ్మ, నాయకులు నగేష్, మక్సుద్, శ్రీశైలం, రమేష్ యాదవ్, శివ, ప్రభు, శేఖర్ , అంజిరెడ్డి, గౌసోదిన్ , ప్రభాకర్, సంగన్న పాల్గొన్నారు.